Meta: మెటాలో లీకు వీరులపై కఠిన చర్యలు 1 y ago
మెటా సంస్థ సున్నితమైన సమాచారాన్ని మీడియాకు అందించారనే కారణంగా కొందరు ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పాలసీకి విరుద్ధంగా ప్రవర్తించినందుకే చర్యలు తీసుకున్నట్టు అధికారికంగా వెల్లడించింది. భవిష్యత్తులో మరోసారి సమాచార లీక్‌లు జరిగితే మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మెటా గోప్యతా విధానాలను ఉల్లంఘించే వ్యవహారాలపై నిఘా పెంచినట్లు సంస్థ వెల్లడించింది.